రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ స‌వాల్..

152
- Advertisement -

రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాల‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స‌వాల్ చేశారు. ఆయన మంగళవారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మ‌క్క‌య్యాయి. ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాల‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. కొంత‌కాలం త‌ర్వాత ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు. మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తార‌ని వినిపిస్తోంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ క‌చ్చితంగా గెలుస్తుంద‌న్నారు. తెలంగాణ ప‌థ‌కాలు దేశానికి దిక్సూచిగా మారాయి. కేసీఆర్ విజ‌న‌రీ నేత‌.. మిగ‌తా పార్టీల నేత‌లు టెలివిజ‌న‌రీలు. రేవంత్ రెడ్డి చిల‌క‌జోస్యం చెప్పుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీలో భ‌ట్టి విక్ర‌మార్క ఒక్క‌రే మంచి వ్య‌క్తి. కానీ కాంగ్రెస్‌లో భ‌ట్టిది న‌డ‌వ‌ట్లేదు.. గ‌ట్టి అక్ర‌మార్కుల‌దే న‌డుస్తోంది అని కేటీఆర్ అన్నారు.

ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్ ఎక్క‌డ‌ అన్యాయం చేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఈటల రాజేంద‌ర్ పదవుల్లో కొన‌సాగార‌ని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళిత బంధును ప్ర‌వేశపెట్టింది ఈటల రాజీనామా చేసినందుకు కాద‌ని, ఈటల మంత్రి వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలోనే దళిత బంధుకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. తాము ఉప ఎన్నిక‌లో జానారెడ్డినే ఓడించామ‌ని, ఈట‌ల రాజేందర్ అంత‌కంటే పెద్ద నాయ‌కుడా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ బుర‌ద‌ను ఈట‌ల అంటించుకున్నార‌ని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు.

- Advertisement -