తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ విశ్లేషణ, సూచన మరియు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.నైరుతి రుతుపవనాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించినవి.
తూర్పు-మధ్య మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈ రోజు మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలకి ఉత్తరం వైపు కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమి ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు కి వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది.
ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటలలో దక్షిణ ఒడిస్సా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరంకిచేరుకునే అవకాశం ఉన్నది.
నిన్న కోస్తా కర్నాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుండి తెలంగాణా వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి ఈరోజు బలహీన పడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మరియు ఎల్లుండి కొన్ని చోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.