హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇప్పుడు మరో కొత్త భయం పట్టుకుంది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరనున్న నేపథ్యంలో ఇరు పక్షాలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా పూర్తి కావడంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఎత్తులు , పై ఎత్తులతో రాజకీయం మరింతగా హీటెక్కనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ నామినేషన్లు వేశారు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి 13 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా 43 మంది కలిసి మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుదిబరిలో ఎంత మంది ఉంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శుక్రవారంనాడు నామినేషన్ వేసిన ఈటల రాజేందర్‌కు షాకింగ్ పరిణామాలు ఎదురయ్యాయి. ఉపఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారి పేర్లు ఇతరత్రా వివరాలను ఈసీ ప్రకటించింది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ కాకుండా రాజేందర్ పేరుతో మరో ముగ్గురు అభ్యర్థులు పోటీచేస్తున్నారు. న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈసంపల్లి రాజేందర్లు పోటీలో ఉన్నారు. వీరంతా నామినేషన్ల గడువుకు చివరి రోజు ఈటల రాజేందర్‌తో పాటు నామినేషన్లు వేయడం గమనార్హం. ముగ్గురు అభ్యర్థుల ఇంటిపేర్లు కూడా ఈ అక్షరంతోనే ప్రారంభం కావడం ఈటలకు తలనొప్పిగా మారింది. ఇంటిపేరు ఇ. అక్షరంతో మొదలవడంతో ఈవీఎంలో ఈటలతో పాటు ముగ్గురు అభ్యర్థుల పేర్లు వరుసగా ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఓటర్లు ఈవీఎంలో రాజేందర్ పేరు చూసి సడన్‌గా ఈటలకు కాకుండా మరో ముగ్గురు రాజేందర్‌లకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవీఎంలో ఇంటిపేరు కూడా ఈ అక్షరంతోనే స్టార్ట్ అవడంతో కాషాయ పార్టీ సానుభూతిపరులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం కమలం సింబల్‌ను గుర్తుపట్టి మీట నొక్కాల్సి ఉంటుంది. దీంతో తనకు దక్కాల్సి ఓట్లను ఎక్కడ తన పేరుతో ఉన్న ముగ్గురు అభ్యర్థులు చీలుస్తారో అని ఈటల రాజేందర్‌కు భయం పట్టుకుంది. అసలే టీఆర్ఎస్ దూకుడుతో ఓడిపోతాననే భయం ఈటలను వెంటాడుతోంది.. ఇప్పుడు తన పేరుతో ఉన్న ముగ్గురు అభ్యర్థులు భారీగా ఓట్లను చీల్చి తన గెలుపు అవకాశాలకు మరింత గండి కొట్టడం ఖాయమని ఈటల ఆందోళన చెందుతున్నాడు.