అదే నిజమైతే ఆత్మహత్య చేసుకుంటా:ఎమ్మెల్యే వనమా

22
mla vanama

తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, అవినీతి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్, పట్టాల పంపిణీలో తాను డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన వనమా… తల్లిదండ్రుల సాక్షిగా, దేవుడి సాక్షిగా తాను ఎవరి నుంచి పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు. పారదర్శకంగా పని చేస్తున్నానని…. డబ్బులిచ్చి అక్రమంగా పట్టాలు పొందిన వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తేవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు.

పోడు సాగుదారులపై ఫారెస్టు ఆఫీసర్లు, స్టాఫ్​ దౌర్జన్యాలు ఆపాలని, ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్​ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. పోడు సాగుదారుల కోసం పోరాడుతున్న టైంలో ఫారెస్టు వాళ్లు తనపై కేసులు కూడా పెట్టారన్నారు.