దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2021లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. కింగ్స్ పోరులో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఏ మూలో కాస్త అవకాశాలు ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయంపై కన్నేసింది. ఇరుజట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది.
చెన్నైతో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. నికోలాస్ పూరన్ స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ కు స్థానం కల్పించినట్టు తెలిపాడు. ఇక, చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవని, గత మ్యాచ్ ఆడిన జట్టును బరిలో దింపుతున్నామని కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఏడైన్ మర్కరమ్, సర్పరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్,హర్ ప్రీత్ బార్, మోజెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డన్, మహ్మద్ షమీ,రవి బిష్ణోయ్, అర్ష దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్.