తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు అడపచులు అందరూ కల్సి ఆడే గోప్ప పండగ బతుకమ్మ అని.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.
మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు…ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.