దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు

40
bodakunti

దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు వస్తోందని TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు శాసన సభలో దళితబంధుపై చర్చ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు రాష్ట్రము మొత్తం అమలు చేస్తామని అన్నడం గొప్ప విషయం అని దళితుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అని అన్నారు.

తెలంగాణ సాధనలో భాగంగానే ఆనాడే దళితబంధుకు అంకురార్పణ జరిగిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అంబేద్కర్ ఆశయసాధనలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పాటుపడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు సర్కార్ అండగా నిలుస్తోందన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంక్‌గానే చూశాయని మండిపడ్డారు. కెసిఆర్ ఆలోచనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

దళితబంధు పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్దిదారులు ఎవరికి వారు ఉపాధి అవకాశం ఎంచుకునే వెసులుబాటు ఉందని, దళితుల కోసం ఇంతగా ఆరాటపడే వ్యక్తి ఎవరూ లేరని ఆయన ప్రశంసించారు. దళితబంధు పథకం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతకు నిదర్శనమన్నారు.