‘మా’ ఎన్నికలు.. మంచు విష్ణుకే బాలయ్య మద్దతు..!

78
- Advertisement -

‘మా’ ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. ప్రచారం ముమ్మరం చేశాడు నటుడు మంచు విష్ణు. ఆయన గత కొద్దిరోజుల నుండి టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులను కలుస్తూ మద్దతును కోరుతున్నారు.. ఈనేపథ్యంలో తాజాగా హీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. ఆదివారం ‘అఖండ’ చిత్రం సెట్స్‌లో బాలయ్యతో భేటీ అయ్యారు మంచు విష్ణు. ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
తన ప్యానెల్ గెలిస్తే ఏం చేస్తామో బాలయ్యకు వివరించారు.

అనంతరం మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా వివరాలు తెలిపారు. బాలకృష్ణ మద్దతు తమకేనని ప్రకటించారు. “థాంక్యూ ఫర్ వన్ అండ్ ఓన్లీ నటసింహం. బాలా అన్నా… ‘మా’ ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. మీ వంటి వారు మా వెన్నంటి ఉండడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ మంచు విష్ణు స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -