బ‌తుక‌మ్మ చీరెలు పంపిణీ చేసిన మంత్రి ఐకే రెడ్డి..

102
- Advertisement -

ప్ర‌తి ఆడ బిడ్డ బ‌తుక‌మ్మ పండుగ‌ను సంతోషంగా చేసుకోవ‌ల‌న్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌తుక‌మ్మ చీరెల‌ను పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. తెలంగాణ ఆడ బిడ్డలందరికి బతుకమ్మ చీరలు అందించి గౌరవించుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఎల్ల‌ప‌ల్లి గ్రామంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మహిళలకు బ‌తుక‌మ్మ చీరెల‌ను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడ‌ప‌చులంద‌రికి పెద్దన్న‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెల కానుకకు శ్రీకారం చుట్టారన్నారు.18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌తుక‌మ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. ప్ర‌తి పేద ఆడబిడ్డ సంతోషంగా పండుగ చేసుకోవ‌ల‌న్న ఆకాంక్ష‌తో చేప‌ట్టార‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.289 రకాల్లో సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరలు తయారు చేసారని తెలిపారు. ఈ ఏడాది 330 కోట్లు ప్రభుత్వం వేచించిందన్నారు.ఎల్లపల్లి సమీపంలో గల రెండు భీమన్న ఆలయాలను త్వరలో పూర్తి చేస్తామని అలాగే భీమన్న గుట్ట బత్తీస్ ఘడ్ వద్ద గల పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయానికి 50 లక్షల నిధులు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -