కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం … 11 మంది మృతి

468
Diwakar Travels Bus Accident - 11 Dead
- Advertisement -

ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ సమీపంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు (AP02 TC 7146) బోల్తా పడింది.  పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర.. హైవేపై ఉన్న డివైడర్ ను ఢీ కొని కల్వర్ట్ లో పడిపోయింది. హైవేపై నుంచి కల్వర్టులో పడిపోవటంతో.. బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులతో పాటు.. ముళ్లపాడు గ్రామస్థులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు రెండు కల్వర్టుల మధ్య ఇరుక్కుపోవటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.  అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Diwakar Travels Bus Accident - 11 Dead

బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. నందిగామ ఆస్పత్రిలో ఎనిమిది మంది, జగ్గయ్యపేటలో ఒకరు, విజయవాడ ఆస్పత్రికి ఇద్దరు చనిపోయారు. 38 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఒడిశా నుంచి తెలంగాణ వ‌స్తున్న ఈ బ‌స్సుకు విజ‌య‌వాడ‌లో డ్రైవ‌ర్ మారాడు. ఆ త‌ర్వాతే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అధికారులు రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. బ‌స్సులో చిక్కుకున్న ప్యాసింజెర్ల‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తులో ఉన్న కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు విడి భాగాలను తొలగిస్తున్నారు.

Diwakar Travels Bus Accident - 11 Dead

- Advertisement -