బండ్ల గణేష్‌ సెల్ఫీ విత్ పవన్

208
bandla ganesh selfie with pawan
- Advertisement -

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏంచేసినా అదివార్తే.రెండు సంవత్సరాలుగా ఆయన బ్యానర్ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి సినిమా రాకున్న గణేష్‌కు ఉన్న క్రేజే వేరు. అందుకే రెండు సంవత్సరాల తర్వాత తిరిగి టాలీవుడ్‌పై కన్నేసిన ఈ నిర్మాత త్వరలో వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక గణేష్‌ ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఆ మాటల్లో  పవన్‌ ప్రస్తావన తప్పక రావాల్సిందే.

ఎందుకంటే పవన్‌తో ఆయనకున్న అనుబంధం అలాంటిది. తన దృష్టిలో పవన్‌ దేవుడని పదే పదే చెబుతుండే గణేష్ … ఒకసారి పవన్ కి దగ్గరైతే .. ఆ తరువాత ఆయనకి దూరం కావడం చాలా కష్టమని అంటూ ఉంటాడు. అయితే, రెండు సంవత్సరాల తర్వాత తన బాస్ పవన్‌ను కలిశాడు.  ఆయనతో ఒక ఫోటో కూడా తీసుకున్నాడు. ఎంతో స్నేహంగా తన భుజం పై పవన్ చేయి వేయగా,ఆయనతో దిగిన ఫోటోను గణేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.

తీన్మార్ సినిమా తర్వాత బండ్ల … పవన్‌ను కలుసుకున్న దాఖలాలు  లేవు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు బలంగానే వున్నాయనే ప్రచారం కూడా జరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కాటమరాయుడు’ షూటింగులో వున్న పవన్ ను గణేష్ కలుసుకున్నాడు. పవన్‌ తో గబ్బర్ సింగ్, తీన్మార్ సినిమాలను రూపొందించిన గణేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ చేస్తాడేమో  చూడాలి.

- Advertisement -