గులాబీ గూటికి బీజేపీ యూత్…

133
kotha
- Advertisement -

మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలం కొనాయపల్లి బీజేపీ యూత్ గ్రామ కార్యవర్గం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని ఎంపీ క్యాంప్ కార్యాలయం లో వారు టీఆర్ఎస్‌లో చేరారు..trs పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని trs లో చేరినట్లు వారు తెలిపారు.

అభివృద్ధి కేవలం trs తోనే సాధ్యమని, ప్రజలంతా trs తోనే ఉంటున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు..కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, జడ్పీ కో అప్షన్ సభ్యుడు రహీం తదితరులున్నారు.

- Advertisement -