హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

38
ganesh

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాదే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు చివరగా అనుమతి ఇస్తున్నామని తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేయగా నిమజ్జనాకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. దీంతో గణేష్ నిమజ్జనంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. హైదరాబాద్‌లో దాదాపు లక్షా 25 వేల విగ్రహాలు ప్రతిష్టించగా వీటిలో మెజార్టీ విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు వచ్చే అవకాశం ఉంది.