ఆలంపూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్..

116
minister ktr
- Advertisement -

ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ముందుగా ఆలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పాల్గొన్నారు.

- Advertisement -