శ్రీవారి సన్నిధిలో శ్రియ దంపతులు..

19
Actress Shriya

మంగళవారం టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ తన భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రియ ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రంలో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే.