- Advertisement -
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవంగా హిందూ సాంప్రదాయంలో వినాయకునికి అత్యంత ప్రాధాన్యతవున్నదని సీఎం తెలిపారు. పిల్లల నుంచి పెద్దలదాకా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే గణేషుని నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.
తొమ్మిదిరోజుల పాటు సాగే ఉత్సవాలు సహా, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని పార్వతి తనయుడు గణనాథున్ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
- Advertisement -