భీమ్లానాయక్ @ 897K లైక్స్‌

126
kalyan
- Advertisement -

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చేసిన వైరల్‌గా మారుతోంది. ఇక పవన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన సినిమా టైటిల్‌ సాంగ్‌కి విశేష స్పందన వచ్చింది. విడుదలైన కొద్దిగంటల్లోనే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 12 మిలియన్ వ్యూస్‌ 897 లక్షల లైక్‌లో నెంబర్ వన్‌ ట్రెండింగ్‌లో ఉంది.

అయితే ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన కొన్ని పదాలు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు చిత్రయూనిట్ అయితే స్పందించలేదు.

- Advertisement -