బిగ్ బాస్ తెలుగు 5..ఫీమెల్ హోస్ట్!

36
nag

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుని 5వ సీజన్ ప్రారంభానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. ఆదివారం(రేపు) సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభంకానుంది. ఈసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెస్టెంట్‌లు ఎవరన్నదానిపై రోజుకో పుకారు షికార్ చేస్తుండగా ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

అయితే ఇప్పటివరకు హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగులో లేడి హోస్ట్‌ను చూడలేదు. కానీ ఈసారి ఫార్మాట్‌ను ఛేంజ్ చేసిన నిర్వాహకులు లేడి హోస్ట్‌ను కూడా ఉంచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అరియానా గ్లోరీని నిర్వాహకులు సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికి ఈ వార్త మాత్రం చర్చనీయాంశంగా మారింది.

గత సీజన్‌లో అరియానా ఇంటి సభ్యుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆట్యిట్యూడ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ ముందుకుసాగింది. ముఖ్యంగా అవినాష్‌తో ఫ్రెండ్‌ షిప్‌ దానిపై గాసిప్స్‌ రావడంతో అరియానా మంచి క్రేజ్ సంపాదించుకుంది.