కార్తీకేయ…రాజా విక్రమార్క టీజర్

227
raja vikramarka

ఆర్ఎక్స్ 100 సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో కార్తీకేయ. ఈ సినిమా సక్సెస్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తీకేయ ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు. ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ అదరగొట్టారు. టీజర్‌లో ఓ వైపు యాక్షన్ మరోవైప్ లవ్‌ రెండు కలగలిపి తెరకెక్కించగా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా తన్య రవి చంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Raja Vikramarka - Official Teaser | Kartikeya, Tanya Ravichandran | Sri Saripalli | 88 Rama Reddy