దేశంలో బీజేపీ ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటుందని విమర్శించారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో తన నివాసం నుండి మీడియాతో మాట్లాడిన గుత్తా…బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం పెంచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజాకంఠక యాత్రగా మారిందని విమర్శించారు. బీజేపీ నేతలు ఏనాడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడరని, వారికి తెలంగాణ ప్రయోజనాలు వారికి పట్టవన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాల ప్రజలు కలిసిమెలసి జీవిస్తున్నారన్నారు. విభేదాలు సృష్టించి, ప్రజలను కొట్టుకునేలా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు
తిప్పికొట్టాలన్నారు. ఆ పార్టీ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్‌ని కట్టడి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు 20వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తుండడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరూ లేరని, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.