పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం..

203
- Advertisement -

టోక్యో పారాలింపిక్స్ లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సోమవారం పురుషుల జావెలిన్ త్రో ఎఫ్62 కేటగిరీలో భారత అథ్లెట్ సుమిత్ అంటిల్ 68.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే 5వ ప్రయత్నంలో ఏకంగా 68.55 మీటర్ల దూరం విసిరి తన వరల్డ్ రికార్డును మరోసారి సవరించాడు.

ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్ బురెయిన్ 66.29 మీటర్ల దూరం విసిరి రజతం, శ్రీలంకకు చెందిన దులాన్ కొడితువాక్కు రజత పతకం గెలిచుకున్నాడు. ఇండియాకే చెందిన సందీప్ చౌదరి 62.20 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంల నిలిచాడు.

- Advertisement -