పారాలింపిక్స్‌లో మరో రెండు పతకాలు..

74
shooters

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు హవా కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇవాళ రెండు పతకాలు ఒకటి గోల్డ్, మరోకటి సిల్వర్ పతకాలను సాధించారు భారత అథ్లెట్లు.

మిక్సిడ్ 50 మీ పిస్టల్ షూటింగ్ లో భారత షూటర్లు మనీష్, సింగ్‌రాజ్ రెండు పతకాలు సాధించారు. ఈ విభాగంలో మొత్తం 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించి షూటర్ మనీష్ స్వర్ణం గెలిచాడు. అలాగే మరో షూటర్ సింగ్‌రాజ్ 216.7 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు.

దీంతో ఇప్పటివరకు భారత్ పారాలింపిక్స్‌లో 15 పతకాలతో 34 వ స్థానానికి చేరుకుంది.