దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో గత 24 గంటల్లో 45,083 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,95,030కి చేరింది. అలాగే, గత 24 గంటల్లో 35,840 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 460 మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,830కి పెరిగింది.
కరోనా నుంచి ఇప్పటివరకు 3,18,88,642 మంది కోలుకున్నారు. 3,68,558 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. కాగా, కేరళలో కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డయిన 45 వేల పాజిటివ్ కేసుల్లో ఒక్క కేరళలోనే 31,265 ఉండటం గమనార్హం. వైరస్ వల్ల రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 153 మంది మరణించారు. అంటే కొత్త కేసులు, మరణాల్లో అత్యధికశాతం వాటా ఆ రాష్ట్రంలోనే ఉండటం విశేషం.