కార్తీక దీపం..దానిని కూడా లవ్‌ చేస్తారా..?

187
monitha
- Advertisement -

బుల్లితెర పాపులర్ షో కార్తీక దీపం. ఇప్పటివరకు 1125 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా తాజా ఎపిసోడ్‌లో దీపను మోనిత కాల్చడం, ఇక సోదమ్మ రూపంలో మోనిత ఉండగా అంజి,దుర్గ మధ్య మోనిత గురించి చర్చ జరుగుతుంది. దానిన ఎవడూ ప్రేమిస్తారురా అంటూ దుర్గకు అంజి చెప్పడం వంటివి ఈ ఎపిసోడ్స్‌కి హైలైట్‌గా నిలిచాయి.

మోనిత సోదమ్మ వేషం వేసుకుని రెడీ అవుతూ దీపని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. లారీతో గుద్ది చంపేయాలా…లేక రివాల్వర్‌తో కాల్చేయాలా అని ఆలోచిస్తూ తన ప్లాన్‌నే ఫాలో అయితే బెటర్ అని డిసైడ్ అవుతుంది. ఇక అంజీ, దుర్గ జాగింగ్ చేస్తూ.. మోనిత గురించి మాట్లాడుకుంటారు. దుర్గ..మోనిత అంటే నాకు లవ్స్.. దొరికితే ముందు నాకే చెప్పు అని అనగా అంజి కోపంగా దాన్ని కూడా లవ్ చేసేవాడు ఉంటాడే ఈ ప్రపంచంలో అంటూ తిడతాడు.

ఇంతలో దీప కారు వచ్చి వాళ్ల ముందు ఆగుతుంది. గుడికి మేము వస్తాం దీపమ్మా.. దూరంగా ఉంటాం అంటారు. కానీ దీప విషయం చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్లాలట అంటూ చెప్పి మీ హెల్ప్ నాకు కావాలి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత దీప, మోనిత ఇద్దరూ ఒకే టైంలో గుడికి చేరుకోగా మోనిత దీప వచ్చిన కారుని వెనుక నుంచి చూసుకుని మురిసిపోతూ.. ఈ కారులో నేను కార్తీక్ చాలా సార్లు తిరిగాం అని గుర్తు చేసుకుంటుంది.

ఇక దీప హోమం మొదలు పెట్టగానే ఆమెను చంపేయడానికి పొదల చాటునుండి గురిపెట్టి చూస్తుంటుంది. అయితే ఎవరో ఒకరు అడ్డు తగులుతుంటారు. పూజలో భాగంగా అఖండ జ్యోతి వెలిగించడానికి దీప పైకి లేవగానే మోనిత కాలుస్తుంది. దీంతో దీప కిందపడిపోతుంది. ఇక వంటలక్కకు ఎక్కడ బుల్లెట్ తగిలింది? దీపకు ఏం అయ్యింది? అన్నీ ఇవాల్టీ ఎపిసోడ్‌లో తెలవనున్నాయి.

- Advertisement -