బన్నీనే రియల్ మెగాస్టార్..మెగాఫ్యామిలీపై ఆర్జీవీ సెటైర్!

66
rgv

మెగా ఫ్యామిలీపై మరోసారి సెటైర్ వేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌ ఘనంగా జరుగగా ఈ పార్టీకి అల్లు అర్జున్ మిస్సయ్యారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురవుతుండగా వారిని మరింతగా రెచ్చగొట్టారు ఆర్జీవీ.

చిరు బర్త్ డే ఈవెంట్‌కి హాజ‌రైన వారంద‌రు ప‌రాన్న జీవులని, బన్నీ మాత్రం రియ‌ల్ మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు వర్మ. బ‌న్నీ ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నార‌ని, మిగ‌తా వారు మాత్రం చిరంజీవి స‌పోర్ట్‌తోనే ఎదిగారు అంటూ ప‌లు కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ అమ్మాయితో తెగ ర‌చ్చ చేసిన వ‌ర్మ అందులో ఉన్న‌ది తాను కాద‌ని చెబుతూ అంద‌రి దేవుళ్ల‌పై ప్ర‌మాణం చేశాడు. అలానే అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌పై కూడా ప్ర‌మాణం చేశాడు. తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీపై విమర్శలు గుప్పించి చిక్కుల్లో పడ్డారు వర్మ.