యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో కొండపాలెం

54
rakul

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్పుడు త‌న రెండో సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జెట్ స్పీడ్‌, ఎక్స‌లెంట్ క్వాలిటీ,డిఫ‌రెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసే క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణ‌వ్ తేజ్ జోడీగా న‌టించారు.

ఇప్పటికే విడుదల చేసిన వైష్ణవ్ తేజ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా నుండి రకుల్ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో రకుల్ ఒబులమ్మగా పూర్తి గ్రామీణ యువతిగానే కనిపించింది. ర‌కుల్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. నల్లమల అడవిలో సామాన్య గొర్రెలకాపరులు చేసే సాహసోపేతమైన జీవనపోరాటం ఇతి వృత్తంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8న థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా 1 మిలియన్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో మారింది.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

Rakul Preet as OBULAMMA - First Look | KondaPolam Movie | Panja Vaisshnav Tej | Krish Jagarlamudi