సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలవుతుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో హీరో సుశాంత్, నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల, కృష్ణచైతన్య, సాయిబాబా, వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అభినవ్ గోమటం తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. కరోనా పరిస్థితుల కారణంగా సింగపూర్‌లోనే ఉండాల్సి వచ్చింది. మా ట్రైలర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. సుశాంత్ యాక్టింగ్ హైలెట్‌గా ఉంటుంది. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ … ఇలా అన్ని అంశాలుండే చిత్రమిది. దర్శకుడు దర్శన్, సుకుమార్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ మ్యూజిక్ ఇలా మంచి టీమ్ కుదిరింది. ఆగస్ట్ 27న నా పుట్టినరోజు నా సినిమా విడుదల కావడం డబుల్ ధమాకాగా భావిస్తున్నాను’’ అన్నారు.
నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల మాట్లాడుతూ ‘‘నాగేశ్వరరావుగారి మనవడు, భానుమతిగారి మనవడు కలిసి సినిమా చేస్తే బావుంటుందని రవిశంకర్‌గారితో చెప్పగానే ఆలోచన బావుందని ఆయన ఒప్పుకున్నారు. దర్శన్ చెప్పిన కథ బాగా నచ్చింది. చి.ల.సౌ సమయంలో ఈ సినిమా కథ విన్న సుశాంత్ వెంటనే ఒప్పుకున్నారు. రవిశంకర్‌గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్కేల్ మారిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని ఆయన మాకు సపోర్ట్ చేశారు. మా సినిమా రెండు లాక్‌డౌన్స్‌ను తట్టుకుని ఇక్కడి దాకా వచ్చిందంటే రవిశంకర్‌గారు, ఏక్తాగారే కారణం. సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌గారు విజువల్‌గా చాలా రిచ్‌గా చూపించారు. ప్రవీణ్ లక్కరాజు ఈ మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. గ్యారీ ఎడిటింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. వెంకట్‌గారు చాలా కీలకమైన పాత్రలో నటించారు.కొత్త నటీనటులను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సుశాంత్ కారణంగానే నేను నిర్మాతనయ్యాను. చాలా మంచి ప్రాజెక్ట్‌ను నాకు ఇచ్చినందుకు తనకు థాంక్స్. సుశాంత్‌ను కొత్తగా చూస్తారు’’ అన్నారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల తర్వాత అనుకోకుండా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీకి మంచి చిత్రంతో రావాలని అనుకుంటున్న సమయంలో ఈ సినిమాలో అవకాశం వచ్చింది. నాపై నమ్మకంతో సుశాంత్ ఇచ్చిన సపోర్ట్‌తో ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ ఎస్.దర్శన్ మాట్లాడుతూ ‘‘2010లో నేను, నా స్నేహితుడు ఫేస్ చేసిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. కథ వినగానే సుశాంత్‌గారికి, హరీశ్‌గారికి బాగా నచ్చింది. మరో సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే వెయిట్ చేశారు సుశాంత్. మధ్య అల వైకుంఠపురములో సినిమా చేశారాయన. నిర్మాతలు రవిశంకర్‌గారు, ఏక్తా మేడమ్‌గారికి, హరీశ్‌గారికి థాంక్స్. రెండు సార్లు లాక్ డౌన్ అయ్యింది. ఆ సమయంలో షూటింగ్‌ను ఆపాం. కానీ నిర్మాతలు ఎంతో ధైర్యం చెప్పారు. చాలా మంది ఓటీటీలో సినిమాను విడుదల చేయమని చెప్పినా నిర్మాతలు వినకుండా థియేటర్స్‌లోనే విడుదల చేయడానికి వెయిట్ చేశారు. సుకుమార్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. వెంకట్‌గారు నేను అనుకున్న పాత్రను మరోలెవల్‌కు తీసుకెళ్లారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘‘దర్శన్ ఈ సినిమాను నిరంజన్ రెడ్డిగారితో చేయాల్సింది. తనతో ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నిరంజన్‌రెడ్డిగారితో మాట్లాడి, ఆయన ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సందర్భంగా నిరంజన్‌గారికి థాంక్స్. చి.ల.సౌ సినిమా అప్పుడు విడుదలవుతుంది. ఆ సినిమా ఆడినా, ఆడకపోయినా ఈ సినిమా చేస్తానని అప్పుడు దర్శన్‌తో చెప్పాను. కథ రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్ ఉండటంతో ఈ కథను వదులుకోకూడదని అనుకున్నాను. చి.ల.సౌ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న హరీశ్ ఈ సినిమా ప్రొడ్యూసర్‌గా మారాడు. ఓ మంచి టీమ్‌ను ఓ దగ్గరికి చేర్చింది హరీశే. రవిశంకర్‌గారు, ఏక్తాగారు లేకుండా ఉండుంటే సినిమాను హోల్డ్ చేసేవాళ్లం కాదు. ఇంతకాలం వెయిట్ చేయగలిగామంటే వాళ్లే కారణం. భానుమతిగారి మనవడు అని తెలియడంతో ఆనందమేసింది. తాతగారు, భానుమతిగారి ఆశీర్వాదాలు మాకు ఉన్నాయని తెలిసింది. ఈ సినిమా కంటే ముందు అల వైకుంఠపురములో సినిమా చేశాను. ఎట్టకేలకు ఈ సినిమాను ఆగస్ట్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓ నటుడిగా ఈ సినిమా నన్నెంతో శాటిస్పై చేసింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి ఇన్‌టెన్స్ ఉంటుంది. మంచి కథను నాకు ఇచ్చిన దర్శకుడు దర్శన్‌కు థాంక్స్. సుకుమార్‌గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కథ నచ్చి సినిమాలు చేసే సినిమాటోగ్రాఫర్‌తో చి.ల.సౌ తర్వాత వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి సీన్‌ను రిచ్‌గా తెరకెక్కించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రవీణ్ లక్కరాజు మూడేళ్ల గ్యాప్ తర్వాత మా సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. మంచి టెంపో ఉన్న సినిమా కదా, అని నేను కూడా ఆలోచించాను. అయితే ప్రవీణ్ రెండు పాటలు వినిపించాడు. ఆ పాటలు వినగానే నువ్వే ఈ సినిమాకు మ్యూజిక్ చేయాలని నేను తనకు చెప్పేశాను. తను మ్యూజిక్ మరో లెవల్‌లో ఇచ్చాడు. రియలిస్టిక్‌గా ఉండేలా ఫైట్స్‌ను రియల్ సతీశ్‌గారు అద్భుతంగా చేశారు. వెంకట్‌గారితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. మీనాక్షి చౌదరిని ముంబైలో ఓ వర్క్ షాప్‌లో కలిశాను. తనకు ఈ సినిమా చేయాలని కోరాను. తను ఓకే అంది. ఈ సినిమా విడుదల కాకముందే తను బిజీ హీరోయిన్ అయ్యింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్, కృష్ణచైతన్య ఇలా మంచి ఆర్టిస్టులు సినిమాకు కుదిరారు. సినిమాలో కొత్తదనం ఉంటుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రొటీన్‌కు భిన్నమైన చిత్రమని గ్యారంటీగా చెప్పగలను’’ అన్నారు.
నటీనటులు:సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఎస్.దర్శన్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల
నిర్మాణ సంస్థలు: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
డైలాగ్స్: సురేశ్ భాస్కర్
ఆర్ట్: వి.వి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్