బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ నియామకం.. ఉత్త‌ర్వులు జారీ..

101

తెలంగాణ బీసీ (వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల) క‌మిష‌న్ చైర్మ‌న్‌గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావును నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం ఉత్త‌ర్వులు జారీచేసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిశోర్ గౌడ్‌, సీహెచ్ ఉపేంద్రను క‌మిష‌న్‌లో స‌భ్యులుగా నియ‌మించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క‌మీష‌న్ సభ్యుల హోదాలతో సమానంగా స‌దుపాయాలు క‌ల్పించ‌బ‌డ‌తాయి.