సోనియా నేతృత్వంలో ప్రతిపక్ష నేతల భేటీ

160
sonia
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో 15 పార్టీల నేతల వర్చువల్‌గా సమావేశం కానున్నారు. బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు ఎన్‌సీపీ చీఫ్‌ శరద పవార్‌ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు.

ఇవాళ జరిగే భేటీలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఇవాళ జరిగే విపక్ష నేతల భేటీలో ఏం నిర్ణయం తీసుకున్నారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -