వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్‌’..!

134
- Advertisement -

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపి వేయలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈరోజు ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఇప్ప‌టికే తెలంగాణ మహిళా ఐక్య వేదిక మండిప‌డింది. సినిమాలో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయ‌ని మ‌హిళ‌లు అభ్యంత‌రాలు తెలిపారు. వాటిని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమా విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్ వ‌ద్ద మ‌హిళల ఆందోళ‌న‌తో ఉద్రిక్త‌త నెల‌కొంది. ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం పోస్ట‌ర్ల‌ను మ‌హిళ‌లు త‌గుల‌బెట్టారు. మూసాపేట‌లోని శ్రీరాములు థియేటర్‌కు వ‌చ్చిన ఈ సినిమా న‌టులు రాజా ర‌వీంద్ర‌, మ‌నోను మ‌హిళ‌లు అడ్డుకున్నారు. ఈ సినిమాలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా సీన్లు ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. సమాజంలో దంప‌తుల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలను తీయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తూ మ‌హిళ‌లు ఆందోళ‌న చేస్తున్నారు.

- Advertisement -