రేవంత్‌రెడ్డి దళిత ద్రోహి- ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

222

దళిత ద్రోహి రేవంత్‌రెడ్డి అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. ఈరోజు ఆయన టీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రింటింగ్ ప్రెస్- గోడలమీద రాతలు రాసే రేవంత్ రెడ్డి వేల కోట్లకు ఎలా ఎదిగారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ళు టీఆర్‌ఎస్ అధికారంలోనే ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.

నా నియోజకవర్గంలో జరిగిన విషయంలో హెచ్‌ఆర్‌సీ కలుగజేసుకోవాలి. ఔట్ డేటెట్ నేతలు- బజానపరులు మాత్రమే రేవంత్ వెంట ఉన్నారు. మేమే గనుక మా శక్తిని ఉపయోగిస్తే- గజ్వెల్‌లో కాలుకూడా పెట్టలేవు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు ఎందుకు వదులుకోవడం లేదు? దళితబంధు పై ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. పథకాలు అమలుకోసం కోర్టుకు పోతారు కానీ- ఆపడానికి పోతారా? అని ప్రశ్నించారు. ఇంద్రవెళ్లి సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీని 500మంది వీడి టీఆర్‌ఎస్ కండువా కప్పున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుర్తు చేశారు.