రాయలసీమ ఎత్తిపోతలపై కేఆర్ఎంబీ నివేదిక సిద్ధం..

277
KRMB
- Advertisement -

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్దం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ కోర్టు దిక్కరణకు పాల్పడినట్టు కేఆర్ఎంబి ధ్రువీకరించింది. ఈమేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటికి నివేదిక సమర్పించింది కేఆర్ ఎంబి. డిపిఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. దీంతో ఎన్జీటి తీర్పును దిక్కరించినట్లు దృవీకరించింది కేఆర్ఎంబీ.

పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్,లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన కేఆర్ఎంబీ అధికారులు ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తి చేసినట్లు నివేదికలో పేర్కొన్నది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను కేఆర్ ఎంబి సమర్పించింది. కేఆర్‌ఎంబీ నివేదిక ఆధారంగా ఈ నెల 16న ఉల్లంఘన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ జరపనుంది. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే ఎపి సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో మండి పడింది ఎన్జీటి.

- Advertisement -