ఎమ్మెల్యే రసమయికి క్యాబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ..

138

మానకొండూర్ శాసనసభ్యులు, ప్రజాగాయకులు రసమయి బాలకిషన్‌కు మరో కీలక పదవి లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మంత్రివర్గ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఇటీవలే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.