సీఎం కేసీఆర్‌కు కృతజ్జతలు తెలిపి గెల్లు శ్రీనివాస్ యాదవ్..

254
kcr
- Advertisement -

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్జతలు తెలిపి..ఆశీర్వాదం తీసుకున్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టు అయ్యి పలుమార్లు జైలుకు వెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

- Advertisement -