142 దేశాలకు డెల్టా వేరియంట్

282
who
- Advertisement -

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. గత వారం రోజులుగా అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

అయితే భారత్, ఇండియా, ఇండోనేషియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. అమెరికాలో కొత్త కేసుల్లో 35 శాతం పెరుగుదల నమోదైందని కూడా పేర్కొంది. ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వేరియంట్ గత వారం కొత్తగా ఏడు దేశాల్లో అడుగుపెట్టిందని వెల్లడించింది. డెల్టా కాటుకు గురైన దేశాల సంఖ్య 142కు చేరగా గత స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ వైరస్ బారిన పడ్డ వారిలో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు అధికంగా ఉంటోందని సూచించింది.

- Advertisement -