రాహుల్ సెంచరీ…భారీ స్కోరు దిశగా భారత్

108
kl

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ రాణించడంతో భారత్‌…ఇంగ్లాండ్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి భారత్‌…276 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్ 127 పరుగులు, అజింక్య రహానే ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ ఓపెనర్లు…ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 145 బంతులాడిన రోహిత్‌…11 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 83 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరిన తర్వాత…క్రీజులోకి వచ్చిన నయా వాల్‌ చతేశ్వర్‌ పూజారా 9 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత విరాట్ కోహ్లీ- రాహుల్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. కోహ్లీ 43 పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టారు.

అయితే తొలుత నెమ్మదిగా ఆడిన రాహుల్….తర్వాత ఫోర్లతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకపడ్డారు. క్లాసిక్ షాట్లతో సూపర్బ్ అని పించారు రాహుల్. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకంగా లార్డ్స్‌ మైదానంలో సెంచరీ పూర్తి చేసిన రాహుల్….ఈ గ్రౌండ్‌లో సెంచరీ చేసిన టీమిండియా మూడో ఓపెనర్‌గా నిలిచారు. రాహుల్‌ కంటే ముందు వినో మన్కడ్‌, రవిశాస్త్రి సెంచరీలు చేశారు.