తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఇతర అగ్రనేతల పనితీరు అధ్వాన్నంగా ఉందని హైకమాండ్ ఫుల్ సీరియస్ అయిందంట…ఇలాగైతే ఇప్పట్లో కాదు కదా…ఎప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రాలేమని అగ్గిలం మీద గుగ్గిలం అయిందంట..పద్దతి మార్చుకోకపోతే పత్తా లేకుండా పోతావని ఢిల్లీ పెద్దలు బండి సంజయ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట..ఇప్పుడిదే కాషాయపార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బండి సంజయ్, అర్వింద్ వంటి నేతల మాటల్లో నిజం ఎంతో ఉందో తెలుసుకునేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీని ఢిల్లీ పెద్దలు హైదరాబాద్‌కు పంపించారంట.. ఈ మేరకు సంతోష్‌జీ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులు చూసి నివ్వెర పోయారంట. క్షేత్ర స్థాయిలో బీజేపీ ఏ మాత్రం బలపడలేదని గ్రహించిన సంతోష్‌జీ పార్టీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారంట…ఇలాగే వ్యవహరిస్తే ఎందుకు పనికిరాకుండాపోతామని కుండబద్ధలు కొట్టారంట.. తెలంగాణ బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శులను కూడా పిలిపించి వారి పనితీరుపై వాకబ్ చేశారంట..హైదరాబాద్‌లో టైమ్ పాస్ చేయకుండా పార్టీని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసేందుకు ఊర్లకు బయలుదేరండి అంటూ సంతోష్‌జీ హుకుం జారీ చేశారంట.. బెంగాల్‌లో కూడా ఇవే పరిస్థితులు ఉండడంతో అధికారంలోకి రాలేకపోయామని, తెలంగాణలో ఆ పొరపాటును చేయద్దని హెచ్చరించారంట….బెంగాల్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీని దెబ్బకొట్టారని, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందని, వెంటనే మైనార్టీ మోర్చాను బలోపేతం చేయాలని సూచించారంట..పార్టీలో యువనాయకత్వానికి పని చేసే అవకాశం లేకపోవడం గుర్తించిన సంతోష్‌జీ ఇలాగైతే ఎలా అంటూ బండి సంజయ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారంట..
యువతను ఎందుకు కలుపుకుపోవడం లేదని బండికి ఫుల్లుగా క్లాస్ పీకారంట..బండి సంజయ్‌తో సహా ఇతర అగ్రనేతలంతా వ్యక్తిగత ప్రచారాన్ని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలంటూ చురకలు అంటించారంట..తెలంగాణలో ఓ పక్క అధికార టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతుందని…మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుటుందని, వారికి ధీటుగా నిలబడాలంటే అనుసరించాల్సిన కొత్త వ్యూహాలను విడమర్చి చెప్పి..మళ్లీ తాను వచ్చేసరికి ఆ వ్యూహాలను అమలు చేసి చూపించాలని బండి, ఇతర బీజేపీ నేతలకు ఘాటుగా చెప్పి వెళ్లిపోయారంట..మొత్తంగా అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఇతర అగ్రనేతలంతా తమ తీరును మార్చుకోవాలని, ఇలాగే ఉంటే వచ్చేసారి కాదు కదా..ఎప్పటికీ అధికారంలోకి రాలేమని సంతోష్‌జీ చిందులు వేయడం తెలంగాణ బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారిందంట..