ఏడేళ్లలో 75 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ సర్కార్…!

165
modi
- Advertisement -

దేశ ప్రజలు 2014లో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినఅవినీతిని హైలెట్ చేసిన మోదీ మాయలో పడిన దేశ ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారు. ఏడేళ్లలో మోదీ పాలనలో భారతదేశం వెలిగిపోతుందని బీజేపీ భక్తులు డబ్బా కొడుతుంటారు కానీ దేశం గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో పడింది. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఎన్నడూ లేనంతగాగా పెట్రోల్, డీజిల్ ధరలను సెంచరీ దాటించి సామాన్యుడి నడ్డి విరిచిన ఘనత మోదీకే దక్కింది. అసలు మోదీ పాలనలో దేశం వెలిగిపోతుందో లేదో కానీ అప్పుల్లో కూరుకుపోయి చీకట్లోకి మాత్రం వెళ్లిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. కాని బీజేపీ మాత్రం దేశంలోనే అతి పెద్ద సంపన్న పార్టీగా వెలిగిపోతుంది. తాజాగా పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌న దేశం అప్పు ఎంతో కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఇదే సంద‌ర్భంలో త‌మ పార్టీ ఆదాయ వ్య‌యాల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ తాజాగా స‌మ‌ర్పించింది.

ఈ రెండింటిని ప‌రిశీలిస్తే మోడీ పాల‌న వ‌ల్ల ఆదాయం ఎవ‌రికి? అప్పులెవ‌రికి స‌మ‌కూరాయో అర్థ‌మ‌వుతుంది. కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు ఎంత అని లోక్‌స‌భ‌లో ఎంపీ స‌జ్జా అహ్మ‌ద్ ప్ర‌శ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాత‌పూర్వ‌కంగా… రూ. 119,53,758 కోట్ల అప్పు ఉంద‌ని స‌మాధానం ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ ఎఫైర్స్‌, ఆర్బీఐ వెబ్‌సైట్‌ల‌లోని వివ‌రాల ప్ర‌కారం 2014, మార్చి 31వ తేదీ నుంచి గ‌త నెల జూలై 31వ‌ర‌కూ కేంద్ర ప్ర‌భుత్వం చేసిన మొత్తం అప్పు 74.74 ల‌క్ష‌ల కోట్లు. స్వాతంత్ర్యం వ‌చ్చిన మొద‌లు 2014, మార్చి 31వ తేదీ వ‌ర‌కూ భార‌త‌దేశ అప్పు రూ.46 ల‌క్ష‌ల 25 వేల 37 కోట్లు. కానీ మోడీ పాల‌న‌లో కేవ‌లం ఏడేళ్ల‌లో క‌నీవినీ ఎరుగ‌ని అప్పులు చేశారు. ఏకంగా ఏడేళ్లలోనే దాదాపు 75 లక్షల కోట్లు అప్పులు చేసిందంటే..మోదీ సర్కార్ దేశాన్ని ఎంతలా అప్పుల ఊబిలోకి నెట్టేసిందో అర్థమవుతుంది. ఇక ఇటీవల తమ పార్టీ ఆదాయ వ్యయాలను బీజేపీ ఎన్నికల సంఘానికి సమర్పించింది.

2019-20 సంవ‌త్స‌రానికి గానూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రూ.5,611.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే రూ.2,100.73 కోట్లు ఖ‌ర్చు చేసింది. బీజేపీకి అత్య‌ధికంగా బాండ్ల రూపంలో రూ.2555 కోట్లు వ‌చ్చింది. ఆజీవ‌న్ స‌హ‌యోగ్ నిధి నుంచి రూ.23.05 కోట్లు వ‌చ్చింది. పార్టీ ప్ర‌చారం, ప్ర‌క‌ట‌న‌లకు రూ.303.30 కోట్లు, అభ్య‌ర్థుల‌కు ధ‌న స‌హాయంగా రూ.199.11 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఒక‌వైపు కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీని ఆర్థికంగా బ‌లోపేతం చేసుకుంటున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆ పార్టీ స‌మ‌ర్పించిన నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. మ‌రోవైపు ఇదే అధికారంతో ఎడాపెడా అప్పులు చేస్తూ దేశాన్ని దివాలా తీయిస్తోంది. మొత్తంగా వేల కోట్ల హవాలా సొమ్ముతో బీజేపీ వెలిగిపోతుంటే దేశం మాత్రం అప్పుల్లో మునిగిపోతూ చీకట్లోకి వెళ్లిపోతుంది. శెహభాష్…అంతా దేశం కోసం..ధర్మం కోసం అంటూ బీజేపీకి మళ్లీ జై కొడితే..ఇక దేశ ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. దేశ ప్రజలారా జాగో…బీజేపీ హఠావో…దేశ్ బచావో..!

- Advertisement -