మహేశ్-త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్‌ అప్‌డేట్‌..

124
Mahesh-Trivikram
- Advertisement -

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను చిత్ర బృందం పంచుకుంది. ఈ రోజున మహేశ్ బాబు పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి అప్ డేట్ ఏదైనా వస్తుందేమోనని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే మేకర్స్ మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా డీటేల్స్‌తో ఒక వీడియోను వదిలారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా పూజ హెగ్డే నటించనుంది. సంగీత దర్శకుడిగా తమన్ రంగంలోకి దిగుతున్నాడు. సినిమాటోగ్రఫర్ గా మథీ .. ఎడిటర్ గా నవీన్ నూలి పనిచేయనున్నట్టు వెల్లడించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘అతడు’ .. ‘ఖలేజా’ సినిమాలు రావడం వలన, ఆ తరువాత రానున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం లేదు. కెరియర్ పరంగా మహేశ్ బాబుకు ఇది 28వ సినిమా.

- Advertisement -