ఆటో అన్నల మద్దతు టీఆర్ఎస్ కే.. ఆటోర్యాలీలో పాల్గొన్న మంత్రి..

61
trs

జమ్మికుంట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు తమ మద్దతును టీఆర్ఎస్‌కు తెలిపారు. టీఆర్ఎస్ కే తమ ఓటు అంటూ నినదించారు. జమ్మికుంట పట్టణంలో ఆటోడ్రైవర్స్ ఆటోర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేలు జెండా ఊపి ర్యాలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, జమ్మికుంట ఆటో యూనియన్ అద్యక్షుడు పురం రమేష్,ఉపాద్యక్షులు జంపయ్య,కార్యదర్శి ఎండి.మెహబూబ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..