గత కొద్దిరోజులుగా కేంద్రం తీరుపై మండిపడుతున్న మమతా…విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఆ రాష్ట్రంలో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కేరళలో దీదీని పిలవండి,దేశాన్ని కాపాడండి,ఛలో ఢిల్లి అంటూ వెలసిన పోస్టర్లు చర్చకు దారితీశాయి. బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న నేత దీదీ అని ఆ రాష్ట్ర నేతలు తెలిపారు. దీంతో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలంటే బలమైన నాయకుడు కావాలి. అలాంటి బలమైన, చరిష్మాకలిగిన నేత దీదీ అని వెలసిన పోస్టర్లు వైరల్‌గా మారాయి.
34 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా బెంగాల్‌ను శాశించిన వామపక్షాల కోటను బద్దలుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బెంగాల్లో దీదీ హవా కొనసాగుతోంది. వరుసగా మూడోసారి తృణమూల్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు మమతా.