జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సహచర మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలతో పాటు చేనేత రంగాన్ని.. అదేవిధంగా ఈ వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న అనేక లక్షల కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తెలిపారు.
చేనేత కార్మికులు ఆనాటి నుండి ఈనాటి వరకు పెద్ద సంఖ్యలో మొగ్గాలపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులది దయనీయ పరిస్థితి ఉండే, వారి పరిస్థితి ఏవిధంగా బాగుపడుతాయి అని, ప్రభుత్వాల పైపు చూసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్నలపై ప్రత్యేక శ్రద్ధతో ఆకలి చావులను అంపాలని, ఆత్మస్థైర్యాన్ని నింపిన మహా గొప్ప మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేతన్నలకు పవర్ సబ్సిడీలు, లోన్ సబ్సిడీలు కావచ్చు, ఓనర్ టు వర్కర్, మరమగ్గాల కార్మికులకు ఆర్ధిక సాయం మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం వల్ల మీకు మీపై నమ్మకం ఏర్పడిందన్నారు.
చేనేత వస్త్రాల వాడకం తగ్గిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి కలిగే ఉద్దేశంతో దసరా, రంజాన్, క్రిస్టమస్ పండుగల సందర్భంగా వస్త్రాలను తయారు చేసి అందించే విధంగా ఉపాధిని రూపొందించిందించారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులకు శాలువాతో సన్మానించి గౌరవించారు మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్. ఈ సమావేశంలో మేయర్ వై.సునీల్ రావు , కలెక్టర్ కర్ణన్, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, నాయకులు వాసాల రమేష్, మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.