మొక్కలు నాటిన కల్వకుర్తి జెడ్పీటీసీ..

87

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్జెడ్పీటీసీ శనివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని హైదబాద్ లోని కర్మన్ ఘట్ తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఏ సందర్భం వచ్చినా ప్రజలు మొక్కలు నాటే చైతన్యం తీసుకువచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.