ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన శాతకర్ణి రికార్డు వసూళ్లను రాట్టింది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా విజయవిహారం చేసింది. ఓవరాల్‌గా సినిమా విడుదలైన తొలి నాలుగు రోజుల్లో శాతకర్ణి రూ.35 కోట్ల షేర్‌తో పాటు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
గౌతమిపుత్రతో సంచలనం సృష్టించిన బాలయ్య తన 101వ సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తొంది. గత నెలరోజులుగా పలువురు దర్శకులు చెప్పిన కథలు వింటున్న బాలయ్య చివరకు ఓ కథకు ఓకే చెప్పినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరీ చెప్పిన కథకు బాలకృష్ణ ఓకే చెప్పడట. అయితే ఈసినిమాకు జయసింహ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్‌ను ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారట.
తన వందో చిత్రం తర్వాత బాలకృష్ణ రైతు సినిమాను చేస్తా అని ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. కానీ ఆ చిత్రాన్నికి అమితాబ్ బచ్చన్ డేట్స్ ఇస్తేనే ఆ సినిమా ప్రారంభమయ్యే పరిస్థితి. ప్రస్తుతం అమితాబ్ డేట్స్ ఇవ్వకపోవడంతో రైతు సినిమాను పక్కన పెట్టి…. దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన సినిమా చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. అదేవిధంగా తన తండ్రి మహానటుడు ఎన్టీరామారావు గారి బయోఫిక్ స్క్రిప్ట్ కూడా లేట్ అవ్వడంతో రవికుమార్ చెప్పిన సినిమాకు ఓకే చెప్పల్సి వచ్చిందట.
మొత్తం మీద దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన ఫ్యాక్షన్ కథకు బాలకృష్ణ ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలయ్య తన 101 సినిమా డైరక్షన్ బాధ్యతలు ఆయనకే ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో రవికుమార్ కోలీవుడ్‌లో రజనీకాంత్, అజిత్ లాంటి అగ్ర హీరోలతో సినిమాను తీసి భారీ విజయాన్ని సాధించాడు. ఇప్పుడు బాలకృష్ణతో రవికుమార్ తీసే సినిమాపై భారీ అంచనలే నెలకొన్నాయి.