టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న భామ నభా నటేష్. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిన నభా….తాజాగా కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో భాగం కానుందట. నభా తొలి తమిళ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా ఇద్దరూ ఓటిటి అరంగ్రేటం చేయబోతున్నారు. ప్రశంసలు పొందిన బ్రిటిష్ స్పై థ్రిల్లర్ సిరీస్ “ది నైట్ మేనేజర్”కు అధికారిక రీమేక్ ఈ వెబ్ సిరీస్.
2015లో కన్నడ చిత్రం ‘వజ్రకాయ’తో వెండితెర రంగ ప్రవేశం చేసింది నభా. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలవడంతో నబ్బా కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చోటుసంపాదించింది. ఇక తెలుగులో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నబా…తర్వాత రవిబాబు దర్శకత్వంలో అదుగో,రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్, రవితేజతో డిస్కో రాజాతో సినిమాలు చేసింది.