కరోనా టీకా వేయించుకున్న పూజ హెగ్డే..

162
Pooja Hegde
- Advertisement -

టాలీవుడ్‌ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కరోనా టీకా ఫస్ట్‌ డోసు వేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. తన రెండేళ్ల వయసులో తొలిసారి టీకా వేయించుకున్నానని… అప్పుడు తనతో పాటు తన తల్లి (లతా హెగ్డే) ఉందని చెప్పింది. మరో ఫొటోకు క్యాప్షన్ గా… ‘భయాన్ని చిరునవ్వుతో కప్పిపుచ్చుకున్నప్పుడు’ అని పేర్కొంది.

ఈ ఏడాది పూజ హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే ఆమె ఐసొలేషన్ కు వెళ్లిపోయింది. కరోనాకు చికిత్స తీసుకుని ఆమె పూర్తిగా కోలుకుంది. ఇక పూజ ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, చిరంజీవి ‘ఆచార్య’, బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ చిత్రాల్లో పూజ నటిస్తోంది.

- Advertisement -