పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ సిద్దూని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. సిద్ధూతో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది.వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ – సిద్ధూ మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుత అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో.. నూతన అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలను స్వీకరించారు. సిద్దూ పలుమార్లు అమరీందర్‌పై ఆరోపణలు, విమర్శలు సైతం చేస్తున్నారు. అంతేకాకుండా సిద్ధూ పలు ఎమ్మెల్యేలను, మంత్రులను సమీకరించి సొంత వర్గాన్ని సైతం కూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. దీంతో పంజాబ్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక రంగంలోకి దిగారు.