టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో క‌రోనా కలకలం…

185
covid
- Advertisement -

మరికొద్దిరోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా ..ఈ ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా చేదువార్తే. టోక్యోలో ఉన్న ఒలింపిక్ విలేజ్‌లో తొలి క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో తొలి కేసు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు టోక్యో నిర్వాహ‌క క‌మిటీ ప్ర‌తినిధి మాసా ట‌కాయా తెలిపారు.

గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం విదేశాల నుంచి వ‌చ్చిన ఓ విజిట‌ర్‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో తెలిపారు. ఆ వ్య‌క్తి ఏ దేశానికి చెందిన‌వారో వెల్లడించలేదు. వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న మ‌హాక్రీడ‌ల్లో మ‌హ‌మ్మారి ఎలా విజృంభిస్తుందో అన్న భ‌యం కూడా ఉంది.

జూలై 23 నుంచి ఆగ‌స్టు 8వ తేదీ వ‌ర‌కు జ‌రిగే క్రీడ‌ల్లో.. ఒలింపిక్స్ విలేజ్‌లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు బ‌స చేయ‌నున్నారు. కరోనా నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -