3.10 కోట్లకు చేరిన కరోనా కేసులు..

24
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 38,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 560 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 3.10 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు కరోనా నుండి 3.02 కోట్ల మంది కోలుకోగా 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,13,091 మంది మరణించారు.

దేశంలో పాజిటివిటీ రేటు 1.91 శాతం, రికవరీ రేటు 97.31 శాతంగా ఉండగా ఇప్పటివరకు 39.96 కోట్లకు పైగా టీకాల డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.జూలై 16 వరకు 44,20,21,954 నమూనాలను పరీక్షించామని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది.