- Advertisement -
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 43 మంది కొత్త మంత్రులను కేబినెట్‌లోకి తీసుకోగా ఇప్పటివరకు 12 మంది కేంద్రమంత్రులు రాజీనామాలు చేశారు.
రాజీనామాలు చేసిన వారిలో సీనియర్ మంత్రులు సదానందగౌడ, రవిశంకర్‌ప్రసాద్,థావర్‌చంద్ గెహ్లాట్, రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, సంతోష్‌కుమార్ గాంగ్వార్, బాబుల్ సుప్రియో, సంజయ్ దోత్రే, రతన్‌లాల్ కతారియా, ప్రతాప్‌చంద్ర సారంగి, దేవశ్రీ చౌదరి ఉన్నారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అమోదించారు. ఇక కొత్తగా తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది.
- Advertisement -